Balineni Srinivasa Reddy: వైసీపీ బండారం బైటపెడతా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం బాంబు పేల్చిన బాలినేని.. డిటెయిల్స్..
Balineni: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
Balineni srinivasa reddy meets with deputy cm pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య అనేక అంశాల మీద చర్చలు జరిగింది. అదే విధంగా.. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం బాలినేని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అడగ్గానే పార్టీలో చేరుకునేందుకు సిద్దపడిన పవన్ కు ధన్యవాదాలు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన ప్రేమ, ఆదరణ జీవితంలోమర్చిపోలేనని అన్నారు. తనకు రాజకీయంగా రాణించేలా చేసింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ పై మండిపడ్డారు. ఆయన కొంత మంది కోటరీలు చెప్పిందే వింటారని ఎద్దేవా చేశారు. తనను చిన్నచూపుగా చూశారని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేసిన తన పట్ల జగన్ అవమానకంగా వ్యవహరించాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఏనాడు కూడా.. డబ్బులు కానీ... పదవులు కోసం పాకులాడిన వ్యక్తిని కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. వైఎస్సార్పీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదన్నారు.
జగన్ ను ఆనాడు గెలిపించుకున్నామని.. కానీ ఆయన కోటరీలు చెప్పిన మాటలు విని ఈరోజు ఓడిపోయారన్నారు. వైసీపీలో ఉండగా ఎన్నోసార్లు ఏడ్చానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం పార్టీ మారిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒక వేళ వైసీపీ వాళ్లు తననుమాత్రం.. ఆరోపణలు చేస్తు.. అసలైన బండారం అంతా బైటపెడతానంటూ కూడా ఘాటుగానే స్పందించారు.
Read more: YS Jagan: జగన్ కు మరో భారీ షాక్.. బాలినేనితో పాటు జనసేనలోకి మరో సన్నిహితుడు జంప్..?
సభల్లో జగన్ ఎప్పుడూ కూడా.. తన గురించి మాట్లాడలేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడారని ప్రశంసించారు. తనపై పవన్ ఎంతో అభిమానంతో ఉన్నారని కొనియాడారు. పవన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈనెల 22న బాలినేనితొ పాటు, సామినేని ఉదయ్ భానులతో పాటుమరికొందరు జనసేనలోకి చేరేందుకు మూహుర్తంఖరారు అయినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.