Big shock ap ysrcp leader YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ కు.. మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోయిందని చెప్పుకొవచ్చు. ఇప్పిటికే బాలినేని రాజీనామాతో బిగ్ షాక్ ఉన్న జగనన్నకు..మరికొందరు కూడా ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా.. జగన్ అన్న పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో తన పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.
మరోవైపు సెప్టెంబర్ 22న మంచి రోజు ఉందని .. ఆరోజు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. రెండు మార్లు ప్రభుత్వ విప్ గా సైతం పనిచేశారు. వైఎస్సార్సీపి అత్యంత సన్నిహితుడిగా కూడా చెప్పుకుంటారు. కానీ ఇటీవల జగన్ కు నమ్మినవాళ్లే మధ్యలో వదలేసి మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. విషయంలో వైఎస్ జగన్ గతంలో తీసుకున్న పలు నిర్ణయాల పట్ల ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారంటా.
వైఎస్ జగన్ పలుమార్లు.. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించినట్లు కూడా తెలుస్తోంది. అయిన కూడా.. బాలినేని మాత్రం వెనక్కు తగ్గలేదు. రాజకీయాలు వేరు.. బంధుత్వాలు వేరని కూడా జగన్ కు ఘాటులా రాజీనామాలేఖలో పేర్కొన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన పట్ల జగన్ ప్రవర్తన సరిగ్గాలేదనిఅన్నారు. జగన్ దగ్గర కోటరీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. అవి నచ్చకే బైటకు వచ్చినట్లు తెలిపారు.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో బాలినేని.. డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్.. అపాయింగ్ మెంట్ కోసం వేచిచూస్తున్నారంట. ఆయనను కలవగానే భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి జగన్ అన్నకు వరుసుగా షాక్ లు తగులుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చేరికటు ఉండనున్నట్లు కూడా ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.