Akhila Priya mass warning to Jagan Mohan Reddy: భూమా అఖిలప్రియ మరొకసారి వార్తల్లో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిగా, ఆళ్లగడ్డ శాసన సభ్యురాలుగా పేరు దక్కించుకున్న భూమా అఖిలప్రియ ఈసారి నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్నూలు జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డితో గొడవకు దిగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ముఖ్యంగా కర్నూలు జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి ను.. ఫోన్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు అఖిల ప్రియ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఎస్వి జగన్మోహన్ రెడ్డికి భూమా అఖిల ప్రియ కోడలు వరుస..అవుతారట. వాస్తవానికి కర్నూలు జిల్లా విజయ డైరీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టడమే.. ఈ గొడవకు కారణం అని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో లేకపోవడం వల్లే.. ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారట.  నంద్యాలలోని డైరీ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె ఆ సమయంలో అక్కడ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి.. లేకపోవడంతో ఆమె ఆయన కూర్చొలో కూర్చున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు.


ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎందుకు జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఫోటోలు కనిపించడం లేదు ఏంటి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుర్చీలో కూర్చోడం పట్ల ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చెయ్యదమే కాకుండా..  ఎలా కూర్చుంటావని ప్రశ్నించారు. దీంతో ఆమె ఆగ్రహం తారస్థాయికి చేరిపోయింది. నన్ను ప్రశ్నించడానికి అసలు నువ్వు ఎవరు..? నన్ను ప్రశ్నించడానికి నీకు ఎలాంటి అధికారం లేదు..? అంటూ భూమా అఖిల ప్రియ తన మామ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు మామగా వస్తే నిన్ను మర్యాదిస్తాను.. నాకు వ్యతిరేఖంగా  వస్తే కేసు పెడతాను అంటూ ఫైర్ అయ్యింది. అలానే నువ్వు నా మామగా ఫోన్ చేసావా లేదా చైర్మన్ గా ఫోన్ చేసావా అని ప్రశ్నించింది. ఆయన వెంటనే మామగా అనగా.. అయితే మామ కుర్చీలో కూర్చోవడంలో తప్పేముంది అంటూ.. ప్రశ్నలు వేసింది.


ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో విజయ డైరీ చైర్మన్ తో ఆమె ప్రవర్తించిన తీరుపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు..’ ఇదే తరహాలో దురుసుగా హెరిటేజ్ సంస్థ చైర్మన్ తో కూడా నువ్వు మాట్లాడగలవా..?’  అంటూ ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ గౌరవప్రద స్థానంలో ఉన్న వ్యక్తితో.. అలా మాట్లాడటం సరి కాదంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. 



 



ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter