Vijayawada Metro Rail: ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని నగరం విజయవాడకు త్వరలోనే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న విజయవాడ మెట్రో కల సాకారం కానుంది. మెట్రో రైలు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. మెట్రో రైలు డీపీఆర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. రెండు దశల్లో మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు మెట్రో రైలు నిర్మాణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతోపాటు విశాఖపట్టణం డీపీఆర్‌ను కూడా ఆమోదం తెలిపారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Zee Telugu: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరుల అరాచకం.. జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌పై దాడి


 


ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు విజయవాడ మెట్రో రైలుపై సమీక్ష చేపట్టారు. విజయవాడలో మెట్రో రైలును రెండు దశల్లో (కారిడార్ 1ఏ, 1బీ) మొత్తంగా 38.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తంగా రూ.11,009 కోట్ల మేర కారిడార్ 1ఏ, బీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: Sachivalaya System: మళ్లీ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు.. సీఎం చంద్రబాబు ఫోకస్‌


 


మెట్రో రైలు నిర్మాణంలో కీలకమైన భూ సేకరణ కోసం రూ.1,152 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేసింది. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్‌ను దాదాపు 27.75 కిలో మీటర్ల మేర నిర్మించాలని ఆలోచన చేస్తోంది.


మొదటి దశ
1ఏ కారిడార్‌: గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు
1బీలో గన్నవరం- పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.