Tirumala Laddu Dispute: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూ తయారీలో జంతు మాంసంతో తయారుచేసిన నెయ్యి వినియోగించారనే వివాదంలో భారీ పరిణామం చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. కల్తీ నెయ్యి అంశంలో సిట్‌ దర్యాప్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలను చేపట్టింది. బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపడుతోంది. తిరుమలతోపాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో విచారణ చేపడుతోంది.
ఇది చదవండి: AP Politics: శ్రీకాళహస్తిలో టీడీపీ Vs వైసీపీ.. గుడివెనుక నా సామీ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. రెండు రోజుల కిందట విచారణ ప్రారంభించిన సిట్‌ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. విచారణలో భాగంగా శనివారం తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్​లో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆహార నమూనాలు, పలు పత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇది చదవండి: New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు


నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్‍డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్‍ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి మరో అధికారి ఈ ప్రత్యేక బృందంలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ ఉన్నారు. సీబీఐ నుంచి హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా సభ్యులుగా ఉన్నారు.


దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఈ సిట్‌ పని చేస్తోంది. దర్యాప్తు బృందం కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రత్యేక బృందం దర్యాప్తులో భాగంగా తిరుమలలో కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తోంది. లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు విభాగాలను కూడా సిట్‌ బృందం పరిశీలించనుంది. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. పూర్తి విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు సిట్‌ బృందం నివేదిక ఇవ్వనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.