New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు అందనున్నాయి. అర్హులైన లబ్దిదారుల్నించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన చేసింది. ఇందులో భాగంగా అర్హులైన కొత్తవారికి సైతం పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది. వార్డు , గ్రామ సచివాలయాలతో పాటు ఆన్‌లైన్ విధానంలో కొత్త లబ్దిదారుల్నించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్త దరఖాస్తుల్ని డిసెంబర్ నుంచి స్వీకరించే అవకాశాలున్నాయి. చివరిగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామసభల ద్వారా నిర్ణయించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. గత ప్రభుత్వం కొందరు అనర్హులకు కూడా పెన్షన్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈసారి కొత్త పెన్షనర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి-2 కార్యక్రమంలో కొత్త పెన్షన్లు విడుదల చేసే అవకాశాలున్నాయి.
దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులైతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
Also read: Cinnamon Water Benefits: రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే ఏం జరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.