Chandrababu Swearing; అవును చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఏపీ ముఖ్యంత్రిగా నాల్గోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తొలిసారి 1995లో ముఖ్యమంత్రి అయ్యేటపుడు అప్పటి ఆయన తోడల్లుడు తెలుగు దేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆ పార్టీలోని మిగతా నేతలు దాన్ని బలపరిచారు. తాజాగా 2024లో ఏపీలో ఎన్టీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని వదిన అయిన దగ్గుబాటి పురందేశ్వరి బలపరిచారు. ఈ రెండు సందర్భాలను టీడీపీ అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా 29 యేళ్ల క్రితం ఏదైతే జరిగిందో ఇపుడు అదే చంద్రబాబు విషయంలో జరగడం విశేషం. మొత్తంగా ఏపీలో చంద్రబాబు తన పేరిట పెద్ద చరిత్రనే లిఖించకున్నాడనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికాసేట్లో జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎన్టీయే భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు.. వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యఅతిథులగా హాజరు కాబోతున్నారు. ఈ వేడుకను కనీవినీ ఎరగని రీతిలో ఎంతో అట్టహాసంగా తెలుగు దేశం శ్రేణులు ప్లాన్ చేశారు. అంతేకాదు 1975లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు... 1978లో శాసనసభ్యుడిగా శాసనసభలో లెగ్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత సుధీర్ఘ పొలిటికల్ హిస్టరీ ఉన్న లీడర్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు లేరు. మరోవైపు 45 యేళ్ల చిన్న ఏజ్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సీఎంగా చంద్రబాబు రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు 74 యేళ్ల ముదిమి వయసులో అదే జోష్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది కూడా ఒక రికార్డు.


మరోవైపు 1999లో వాజ్ పేయ్ గవర్నమెంట్ లో దాదాపు 29 ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా 16 మంది ఎంపీలతో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చక్రం తిప్పడం మాములు విషయం కాదు. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పడం అనేది చంద్రబాబుకే సాధ్యం అయిందనే చెప్పాలి.


Also read: Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook