Sujana Chowdary: టీడీపీలోకి సుజనా చౌదరి రీ ఎంట్రీ? ఆ నలుగురికి బీజేపీలో అన్ని అవమానాలేనట!
Sujana Chowdary: 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతోంది.
Sujana Chowdary: 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున పోరాడుతోంది టీడీపీ. అసెంబ్లీ ఎన్నికలకు మరో 20 నెలల గడువున్నా దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతోంది. పార్టీ బలోపేతంపైనా ఫోకస్ చేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గతంలో టీడీపీలో కీలకంగా ఉండిఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతోంది.
సుజనా చౌదరిలో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు. సుజనాకు తెలియకుండా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరనే టాక్ కూడా ఉంది. అందుకే రెండు సార్లు ఆయనను రాజ్యసభ సీటిచ్చారని అంటారు. 2014లో కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరగా.. సుజనా చౌదరికి సహాయమంత్రి పదవి దక్కింది. అయితే టీడీపీ టాప్ లీడర్లలో ఒకరైన సుజనా చౌదరి 2019 ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరారు. సుజనా చౌదరితో పాటు ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ కమలం పార్టీలో చేరడంతో పాటు రాజ్యసభలో టీడీఎస్పీని బీజేపీఎల్పీలో విలీనం చేసేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా, సీఎం రమేష్, గరికపాటిలు బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనమైంది. అయితే బ్యాంకు కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లు.. ఈ కేసుల మాఫీ కొసమే బీజేపీలో చేరారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ వర్గాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో తమకు ఇబ్బంది లేకుండా ఉండటానికి తన సన్నిహితులను చంద్రబాబే బీజేపీలోకి పంపించారని ఆరోపించారు.
తన వ్యాపారులు, ఆర్థిక లావా దేవీలను చక్కబెట్టుకోవడానికే సుజనా చౌదరి బీజేపీలో చేరారని చెప్పేవాళ్లే ఎక్కువ. అయితే బీజేపీలో మొదట కొంత యాక్టివ్ గా పని చేసిన సుజనా చౌదరి తర్వాత నెమ్మదించారు. ఏపీ ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసిన సుజనా.. తర్వాత తగ్గించారు. ఇందుకు బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే కారణమంటారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి కొంత అగ్రెసివ్ గా మాట్లాడేవారు. దీనిపై వైసీపీ నేతలతో పాటు కొందరు బీజేపీ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని ప్రచారం సాగింది. పార్టీ స్టాండ్ ప్రకారమే నడుచుకోవాలని ఆయన హైకమాండ్ సూచించిందనే వార్తలు వచ్చాయి. ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు సుజనా చౌదరికి మంచి సంబంధాలు లేవు. సోముతో పాటు మరికొందరు నేతలు కూడా సుజనా తీరును తప్పుపట్టేవారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో సుజనా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.ఇటీవలే సుజనా చౌదరి రాజ్యసభ పదవి కాలం ముగిసింది. ఆయనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందని భావించినా అది జరగలేదు.
ఇక ఎంపీగా ఉన్నప్పుడు అంతోఇంతో సుజనా చౌజరికి పార్టీలో ప్రాధాన్యత దక్కేదని.. పదవి పోయాకా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంతో సుజనా చౌదరీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు. బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చారు సుజనా చౌదరి. తాను ఎవరినీ మోసం చేయలేదని, బ్యాంకులను ఛీట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ విధానాలు నచ్చే బీజేపీలో చేరారని తెలిపారు.ఆ ఇంటర్వ్యూలో సుజనా చెప్పిన వివరాలను బట్టి.. ఆయన బీజేపీలో ఎక్కువ కాలం ఉండలేరని ఖాయమైందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ పట్ల సానుకూలంగా మాట్లాడటంతో ఆయన తిరిగి సొంతగూటికి చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆర్థికంగా ఏపీని జగన్ దివాళా తీయించారనే భావన జనాల్లో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చేయిస్తున్న సర్వేల్లోనూ జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని వస్తుందట. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉండటంతో పాత కాపులంతా రిటర్న్ బ్యాక్ వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి చంద్రబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని పక్కాగా చెబుతున్నారు. సీఎం రమేష్ కూడా త్వరలోనే సైకిల్ ఎక్కుతారనే చర్చ కూడా సాగుతోంది.
Also read: MLA PA Attack: భర్తను వదిలేసి నాతో రా.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ!
Also read: Ladakh Earthquake: కార్గిల్‌లో భారీ భూకంపం.. భయాదోళనలో ప్రజలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok