Ladakh Earthquake: ఇవాళ లడఖ్‌లోని కార్గిల్‌లో (Earthquake In Kargil) రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భూమికి 10 కి.మీ దిగువన భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఇది కార్గిల్, లడఖ్‌కు వాయువ్యంగా 64 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదు.
లడఖ్‌లో ఈ మధ్య తరుచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. లేహ్‌కు ఈశాన్యంగా 142 కిలోమీటర్ల దూరంలో గత ఆదివారం నాడు 4.0 తీవ్రతతో భూకంపం (Ladakh Earthquake) వచ్చింది. అదే విధంగా గత శుక్రవారం ఉదయం 4.19 గంటలకు లడఖ్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది లేహ్ కి ఉత్తరంగా 189 కిమీ దూరంలో సంభవించింది.
Earthquake of Magnitude:4.3, Occurred on 19-09-2022, 09:30:15 IST, Lat: 34.86 & Long: 75.54, Depth: 10 Km ,Location: 64km WNW of Kargil, Laddakh, India for more information Download the BhooKamp App https://t.co/OZjR2ntG2b pic.twitter.com/Kjy1XtuZ0H
— National Center for Seismology (@NCS_Earthquake) September 19, 2022
Also Read: Hanuman idol binked Eyes: మధ్యప్రదేశ్‌లో అద్భుతం.. కళ్లు ఆర్పిన హనుమంతుడు.. వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook