ఏపీ సీఎం YS Jaganకు ధన్యవాదాలు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
09:2020 తేదీన తాను రాసిన లేఖకు స్పందించి లెక్చరర్లకు వేతనాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy). తన లేఖకు స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలలపాటు జీతాలు (AP Contract Lecturers Salaries) అందిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో జీవో విడుదల చేయనుంది. అయితే 04:09:2020 తేదీన తాను రాసిన లేఖకు స్పందించి లెక్చరర్లకు వేతనాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy). తన లేఖకు స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘ఆ వేతనాలపై ఆధారపడి బతుకుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు కోవిడ్19 లాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగురు లెక్చరర్లు ఆర్ధిక ఇబ్బందులు వల్ల చనిపోవడం జరిగింది, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశాం. దాదాపు ఐదు నెలల వేతనాలు లేక అనేక ఇబ్బందులకు కాంట్రాక్టు లెక్చరర్లు గురయ్యారని’ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సెప్టెంబర్ మొదటి వారంలో లేఖ రాయడం తెలిసిందే.
కాగా, కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఇప్పటివరకూ అందుకుంటున్న 10 నెలల జీతాన్ని ఇకనుంచి 12 నెలలకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో ఏపీలోని 5,042 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది.
ఇవి కూడా చదవండి
- Contract Lecturers Salaries In AP: కాంట్రాక్ట్ లెక్చరర్లకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త
- Anantapur: 340 వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe