హైదరాబాద్: రాజ్‌భవన్ లో గురువారం బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల దృష్ట్యా టీడీపీ నేతలు, మంత్రులు మోదీపై వ్యక్తిగత ఆరోపణులు చేస్తున్నారని.. వారిని కట్టడి చేసే  దిశగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై తిరుమలలో చేసిన దాడిపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవర్నర్‌ను కలిసిన వారిలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో పాటు కావూరి సాంబశివరావు, మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి లాంటి  గౌరవప్రదమైన పదవిలో ఉన్న మోడీపై టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.టీడీపీ నేతలు ఇలాంటి చవకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. ప్రధాని మోడీని  విమర్శిస్తే ఖబర్దార్ అంటూ  ఈ సందర్భంగా  కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నేతలకు హెచ్చరించారు.


ఇటవలే టీడీపీ బీజేపీ సంబంధాలు తెగిన నేపథ్యంలో మహానాడు వేదికపై టీడీపీ ఎమ్మెల్యే , సినీ నడుడు  బాలకృష్ణ తో సహా పలవురు టీడీపీ నేతలు మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.