AP CM YS JAGAN: బ్రేకింగ్ న్యూస్, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్, ఇక నిత్యం ప్రజల్లోనే
AP CM YS JAGAN: ఏపీలో అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఎన్నికలు జరిగినా విజయ దుందుభి మోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రజలకు ఇంకా విశ్వాసం సన్నగిల్లలేదనేందుకు ఇదే ఉదాహరణ. ఇదే తరుణంలో వైఎస్ జగన్ ముందస్తు మోగించనున్నారనేది ఓ సమాచారం.
AP CM YS JAGAN: ఏపీలో అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఎన్నికలు జరిగినా విజయ దుందుభి మోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రజలకు ఇంకా విశ్వాసం సన్నగిల్లలేదనేందుకు ఇదే ఉదాహరణ. ఇదే తరుణంలో వైఎస్ జగన్ ముందస్తు మోగించనున్నారనేది ఓ సమాచారం.
2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ విజయం సాధించింది. పాదయాత్రతో రాష్ట్రమంతా చుట్టివచ్చిన వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan). అధికారం చేపట్టి సంవత్సరం తిరగకుండానే కరోనా మహమ్మారి వచ్చి పడింది. కొత్త రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుుకుని సంక్షేమ పథకాల్ని మాత్రం ఆపలేదు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. బహుశా అందుకే ప్రజల్లో కూడా అతనిపై నమ్మకం ఏ మాత్రం సడలలేదు. ఈ ఏడాది వరుసగా వచ్చిన పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలన్నింటిలోనూ అధికార పార్టీ వన్ సైడెడ్ విక్టరీ నమోదు చేసింది. ఇటీవల జరిగిన తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో అయితే గతంలో కంటే భారీ మెజార్టీ వచ్చింది పార్టీకు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న ఆమోదంగా అందరూ భావిస్తున్నారు.
2019లో అధికారంలో వచ్చేటప్పుడే 2-3 పర్యాయాలు వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) ప్రభుత్వం ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా చర్యలు అప్పుడే ప్రారంభించేశారు. పరిస్థితి బాగున్నప్పుడు అన్నీ సెట్ చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచనలో(Ys jagan pre polls plan) వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2024లో ఏపీ అసెంబ్లీకు ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి. కానీ అంతకంటే ముందే అంటే 2023లో ముందస్తు ఎన్నికలకు వెళితే బాగుంటుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే ముందస్తు ఎన్నికలు ఏడాది ముందా లేదా ఆరు నెలలు ముందా అనేది ఇంకా నిర్ణయించలేదు. ఆరు నెలలు ముందుగా అయితే తెలంగాణ ఎన్నికలతో పాటుగా ఏపీ ముందస్తు ఎన్నికలు జరగవచ్చు. లేదా ఏడాది ముందుగా అనుకుంటే కర్ణాటక ఎన్నికలున్నాయి. దేశంలో మరో 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా 2023లో జరగాల్సి ఉన్నాయి.
2023లో ముందస్తు ఎన్నికల (Pre Polls)ప్రణాళికలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 అంటే వచ్చే ఏడాదంతా ప్రజల ముందుండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాను కలియతిరగనున్నారు. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ నిత్యం ప్రజల్లోనే ఉండేవిధంగా కొత్త షెడ్యూల్ రూపుదిద్దుకుంటోంది. ఈ వార్తలపై ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also read: MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook