ఏపీ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు
విభజన హామీల అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది.
ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విభజన హామీల అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. విభజన హామీలపై చర్చించేందుకు ఈ నెల 23న ఢిల్లీ రావాలని ఏపీ సీఎస్ కు పిలుపు అందింది. ఈ చర్చ సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రెవెన్యూ లోటు, దుగరాజపట్నం పోర్టు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన తదితర అంశాలపై చర్చ జరగనుంది. సంస్థల విభజనపై చర్చ జరుగుతున్నందున ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ కు ఆహ్వానించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేసిన ఆర్ధిక సాయానికి సంబంధించిన సమగ్ర సమచారంతో రావాలని ఆర్ధిక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.