AP Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ?
AP Elections 2024: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరోవైపు ఎన్నికల కసరత్తు కూడా ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఏపీలో ఎన్నికలకు అంతా సిద్ధమౌతోంది. ఈసారి ఎన్నికలు నెలరోజులు ముందే జరగనున్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్నకేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేలా సంకేతాలు ఇస్తోంది.
ఏపీలో ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ 10న విడుదల కాగా ఈసారి అంతకంటే ముందు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వెలువడవచ్చని తెలుస్తోంది. ఎన్నికలు గతంలో కంటే కాస్త ముందుగా ఉండే అవకాశాలుండటంతో ఏపీ ప్రభుత్వం అందుకు సిద్ధమైంది. మార్చ్ నెలలో పదవ తరగతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇవాళ రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న మొదటి రోజున 18 జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఇవాళ మరో 8 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించనుంది. ఇవాళ నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం సమావేశమౌతోంది.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా చెక్ పోస్టులు, ఎన్నికల తనిఖీ కేంద్రాలు, సమస్యాత్మ ప్రాంతాల్లో భద్రత వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. మరోవైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించనుంది. ఎందుకంటే తొలిరోజు సమావేశంలో ఇదే విషయమై వ్యాఖ్యానించింది. ఒటర్ల జాబితాలో అవకతవకల్ని సీరియస్‌గా పరిగణిస్తామని పేర్కొంది. ఇవాళ మద్యాహ్నం నుంచి ఏపీ ఛీఫ్ సెక్రటరీ, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించనుంది.
Also read; Aditya L1: తుది లక్ష్యానికి చేరువలో ఆదిత్య ఎల్ 1, జనవరి 6న ఎల్ 1 పాయింట్ చేరనున్న మిషన్ ఆదిత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook