Aditya L1: తుది లక్ష్యానికి చేరువలో ఆదిత్య ఎల్ 1, జనవరి 6న ఎల్ 1 పాయింట్ చేరనున్న మిషన్ ఆదిత్య

Aditya L1: చంద్రయాన్ 3 విజయవంతమైన తరువాత భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఖ్యాతినార్జించనుంది. సూర్యుని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్ 1 మిషన్ త్వరలో తుది లక్ష్యం చేరుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 23, 2023, 11:34 AM IST
Aditya L1: తుది లక్ష్యానికి చేరువలో ఆదిత్య ఎల్ 1, జనవరి 6న ఎల్ 1 పాయింట్ చేరనున్న మిషన్ ఆదిత్య

Aditya L1: ఇస్రో త్వరలో మరో కీర్తిని ఆర్జించనుంది. శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ లక్ష్యానికి అత్యంత సమీపంలో ఉంది. త్వరలోనే తుది లక్ష్యాన్ని చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. అదే జరిగితే ఇస్రో చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కరించనుంది. 

చంద్రయాన్ 3 విజయంతో ఇస్రో ఖ్యాతి మరోసారి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన చేరింది. చంద్రయాన్ 3 విజయానంతరం కొద్దిరోజుల వ్యవదిలోనే ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించింది. ఇస్రో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజులు..1. మిలియన్ కిలోమీటర్ల ప్రయాణం తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్‌లో ప్రవేశించాల్సి ఉంది. 

ఈ మిషన్ తాజా అప్‌డేట్స్ ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ వెల్లడించారు. జనవరి 6వ తేదీన ఆదిత్య ఎల్ 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ తెలిపారు. జనవరి 6వ తేదీన ఎన్ని గంటలకు చేరుతుందనే కచ్చితమైన సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు ఇండియా ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్ 1. జనవరి 7, 2024 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన పనులతో పాటు శాస్త్రీయ ప్రయోగాలకై సూర్యుని చిత్రాల్ని తీసి పంపిస్తుంది. వచ్చే ఏడాది 2024లో జనవరి 6వ సూర్యుని అత్యంత సమీప కక్ష్యలో ప్రవేశించినా మొత్తం ప్రక్రియ మాత్రం 7వ తేదీనాటికి పూర్తి కానున్నాయి. 

Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News