Seize the Ship: కాకినాడ డీప్ పోర్ట్ నుంచి బియ్యం అక్రమంగా రవాణా అయిపోతోందంటూ రాద్ధాంతం చేసి సీజ్ ధి షిప్ అంటూ సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు గట్టి దెబ్బే తగిలినట్టుంది. షిప్ నిలిపివేత సరైంది కాదంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ తేల్చిచెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అయిపోతుందంటూ కాకినాడ పోర్టులో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హడావిడి చేశారు. లేని అధికారాలు ఆపాదించుకుని సీజ్ ది షిప్ అంటూ సంచలనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయినంతగా కేసులో పస లేదని తెలుస్తోంది. పోర్టుకు వెళ్లకుండా తనపై ఒత్తిడి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై స్పందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ బియ్యం ఎలా తరలిస్తున్నారో వివరించారు. పవన్ పర్యటనతో ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై సిట్ విచారణ చేపట్టింది. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి షిప్ సీజ్ చేసే అధికారమే లేదన్న వాదనలు విన్పించాయి. 


ఇప్పుడు తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది. ఆకలి నివారణకై ఆఫ్రికాతో చేసుకున్న జీటూజీ ఒప్పందానికి విఘాతం కల్గించవద్దని ఏపీ ప్రభుత్వానికి, కాకినాడ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. తనిఖీల పేరుతో ఆటంకాలు ఏర్పర్చితే దేశానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు జరిగే నూక బియ్యం ఎగుమతులకు ఇబ్బందులు కల్గించవద్దని సూచించింది. ఫోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లున్నాయనే కారణంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఎగుమతి కాకుండా అడ్డుకోవడం సరైంది కాదని తెలిపింది. భారత విదేశాంగ శాఖ ఇదే విషయాన్ని తరచూ మెయిల్స్ ద్వారా ప్రశ్నిస్తోందని లేఖలో ప్రస్తావించింది. నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనేది హోంశాఖతో పాటు సహకార శాఖ పరిధిలో పనిచేస్తుంది.


Also read: Toll Plaza: ఏపీలో టోల్ బాదుడు, ఎన్నిసార్లు దాటితే అన్నిసార్లు కట్టాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.