Toll Plaza: ఏపీలో ఇప్పుడు అందరికీ టోల్ ప్లాజా భయం పట్టుకుంది. ఒకేరోజైనా ఎన్ని సార్లు టోల్ దాటితే అన్ని సార్లు జేబులోంచి డబ్బు గుల్లవుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి. కొత్త నిబంధనల ప్రకారం కట్టాల్సిందేనంటున్నారు.
ఏపీలో మొత్తం 69 టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని కీసర, నెల్లూరు -చెన్నై మార్గంలోని వెంకటాచలం, బూదరం, సూళ్లూరు పేట టోల్ ప్లాజాలు తప్పించి మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా వాహనదారులు జేబు గుల్లవుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఒకేరోజులో టోల్ ప్లాజా ఎన్నిసార్లు దాటితే అన్నిసార్లు డబ్బులు కట్టాల్సిందే. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుమునుపు 24 గంటల వ్యవధిలో ఒకసారి దాటితే 160 , తిరుగు ప్రయాణంలో 80 రూపాయలుండేది. 24 గంటల్లో మళ్లీ దాటితే టోల్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఎన్ని సార్లు దాటితే అన్నిసార్లు పూర్తి టోల్ వసూలు చేస్తున్నారు. రెండోసారి సగం వసూలు చేస్తున్నారు. ఫలితంగా కొన్ని టోల్ ప్లాజాల విషయంలో ప్రజల నడ్డి విరుగుతోంది.
ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలాదిమంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా విజయవాడ-మంగళగిరి మధ్య 24 గంటల వ్యవధిలో 2-3 సార్లు దాటే పరిస్థితి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న కాజా టోల్ ప్లాజా దాటాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. టోల్ ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో కొత్త నిబంధనల ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి.
Also read: AP Heavy Rains: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.