What is IPC Section 409: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఏం జరగబోతుందనే సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రస్తుతం కోర్టులో వాడీవేడిగా చర్చలు జరుగుతుండగా.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..? రాదా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించాల్సిందిగా చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్‌పై చంద్రబాబు స్వయంగా వాదనాలు వినిపించారు. తన అరెస్టు అక్రమం అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని.. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక చంద్రబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409పై చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్‌లోనే చంద్రబాబుకు బెయిల్  వస్తుందా రాదా అనేది అనుమానంగా మరింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం.. ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన ప్రజా సేవకులు వారిని మోసం చేస్తే నేరం కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, కారకం, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే.. జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించే వివరణతో కూడిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.


శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు. అయితే చంద్రబాబు పాత్ర నిరూపించకుండా 409 వర్తించదని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా వాదించారు. కానీ ఏ35 విచారణలో ఇలాగే వాదించినా.. 409 సబబేనని హైకోర్టు పేర్కొందని సీఐడీ లాయర్ రిఫరెన్స్ ఇచ్చారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ తరఫున AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. 'ఇటీవల A-35ను అరెస్ట్ చేశాం. A-35 రిమాండ్‌ను ఇదే కోర్టు తిరస్కరిస్తే.. పైకోర్టు రిమాండ్ విధించింది. 2015లోనే ఈ స్కాం మొదలైంది. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం. గతంలో అరెస్ట్ చేసిన 8 మంది పాత్ర ఎంత ఉందో.. బాబు పాత్ర అంతకు మించి ఉంది' అని పొన్నవోలు కోర్టుకు వివరించారు.


ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యేసరికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకూ కొనసాగుతాయని అంటున్నారు. కాగా తొలుత 409 సెక్షన్‌పై చంద్రబాబు లాయర్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు స్టేట్మెంట్‌ను సైతం రికార్డు చేశారు. 


Also Read: Chandrababu Case Updates: అది నా నిర్ణయంకాదు, ప్రభుత్వ నిర్ణయం, కోర్టులో చంద్రబాబు


Also Read: Pawan Kalyan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook