Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ అవడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ స్కాంలో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ పిటీషన్‌కై ఏపీ హైకోర్టులో మరోసారి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించగా, సీఐడీ తరపున సుధాకర్ రెడ్డి వాదించారు.
ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ఆరోగ్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి తీర్పు రిజర్వ్‌లో చేయబడింది. ఈ క్రమంలో రెగ్యులర్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుని కావాలని అరెస్ట్ చేశారని, 2018 నుంచి విచారణ చేస్తూ ఏం సాధించారని సిద్ధార్ధ లూథ్రా వాదించారు. అందుకే కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
చంద్రబాబు మద్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని సీఐడీ తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదించారు. 10 రూపాయల నోట్లు వాడి హవాలా ద్వారా డబ్బును తరలించారని తెలిపారు. బోస్, కన్వేల్కర్‌ల మెస్సేజ్‌ల ద్వారా డబ్బు హవాలా రూపంలో హైదరాబాద్ చేరిందని తెలిసిందన్నారు. విచారణ కీలక దశలో ఉందని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు విచారణ ముగిసినట్టు తెలిపింది. తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడిచ్చేది ఇంకా స్పష్టత లేదు. క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండటం, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు మరో 12 రోజుల్లో ముగియనుంది.
Also read: Midhili Cyclone: ఏపీకు తప్పిన ముప్పు, బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న మిథిలి తుపాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook