Channdrababu Case Updates: ఏపీ స్కిల్ స్కాంలో నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన పార్టీ నేతలకు ఆందోళన అధికమౌతోంది. మద్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపధ్యంలో ఆయనపై ఉన్న ఇతర కేసుల విషయంలో వివిధ కోర్టుల్లో పరిస్థితి గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆందోళన అధికమౌతోంది. నవంబర్ 28న మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. అదే సమయంలో ఆయనపై ఉన్న ఇతర కేసులు ఒకదానివెంట మరొకటి వెంటాడుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, లిక్కర్ పాలసీ స్కాం, అంగళ్లు కేసు ఇలా చాలా కేసులున్నాయి. మిగిలిన ఈ కేసుల్లో ఇంకా అరెస్ట్ కాకపోవడంతో అన్నింట్లో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నారు. కోర్టులో చంద్రబాబు టీమ్ దాఖలు చేసిన పిటీషన్లతో  అసలుకే సమస్య వచ్చిపడిందనే వాదన విన్పిస్తోంది. ఎందుకంటే ఈ కేసులన్నీ ఒకదానితో మరొకటి చిక్కుకుని కోర్టులు నిర్ణయం చెప్పలేని పరిస్థితికి వచ్చిందనే వాదన వస్తోంది. అటు స్కిల్ స్కాంలో కూడా బెయిల్ కోసం కంటే క్వాష్ కోసమే ఎక్కువగా పట్టుబడటం మరో కారణం. 


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28లోగా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవల్సి ఉంటుంది. ఇక ఇదే కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఈ నెలాఖరుకు తీర్పు రావచ్చు. తీర్పు ఇప్పటివరకూ రిజర్వ్ లో ఉంది. 


ఇక ఇదే స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో నవంబర్ 22కు వాయిదా పడింది. 


ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగులో ఉంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 30కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా మరో 170 మంది ఉన్నారు. ఇక మద్యం విధానాల్లో అక్రమాలకు సంబంధించి సీఐడీ తాజాగా దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో నవంబర్ 21కు వాయిదా పడింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో నవంబర్ 22కు వాయిదా పడింది. 


Also read: Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె శస్త్ర చికిత్స, నెలరోజుల విశ్రాంతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook