Chandrababu: ఎన్టీఆర్ పేరును చంద్రబాబు నిజంగానే తొలగించాలనుకున్నారా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. ఎన్టీఆర్ మాకు అవసరం లేదంటూ చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా బాలకృష్ణ కూడా దీనిపై స్పందించారు. రాష్ట్రమంతా ఈ విషయంపై చర్చ జరుగుతున్నా..ఇదంతా జగన్ స్కెచ్ అని ఇప్పటికే స్పష్టమైంది. జగన్ వేసిన స్కెచ్‌లో చంద్రబాబు అండ్ కో పడ్డారని తెలుస్తోంది. 


వైఎస్ జగన్ స్కెచ్ ఇదీ


నిజానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం వెనుక పెద్ద మర్మమే ఉంది. ఎన్టీఆర్ ఖ్యాతిని తగ్గించడమో లేదా తొలగించడమో జగన్ ఉద్దేశ్యం కాదు. ఇప్పటికే జగన్‌కు ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవముంది. అయితే టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ ప్రభావాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఇదంతా జరిగింది. పేరును తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఈ అంశం చర్చకు వచ్చేలా చేశారు. అదే చర్చ సందర్భంగా ఎన్టీఆర్‌ను నాడు చంద్రబాబు అండ్ కో ఎలా మోసం చేశారు, ఆయనపై ఎన్ని నిందలేశారు, ఎలా దూషించారు, ఆయన విలువల్ని దిగజార్చేందుకు చేసిన ప్రయత్నాలేంటి ఇవన్నీ ప్రజల ముందుంచాలనేదే జగన్ వ్యూహం. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. నాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన వెన్నుపోటు ఎపిసోడ్ మొత్తం మరోసారి ప్రజలకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


విజయవాడ రోడ్లపై కలకలం కల్గిస్తున్నపేపర్ క్లిప్పింగులు


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్రాప్‌లో చంద్రబాబు అండ్ కో పడ్డారనేది ఇప్పుడు మరోసారి నిజమైంది. 1995 సంక్షోభం సమయంలో చంద్రబాబు డెక్కన్ క్రానికల్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్యూ క్లిప్పింగులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అవసరం మాకు లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పిన విషయం హెడ్‌లైన్‌గా ఉంది. ఈ క్లిప్పింగులు ఇప్పుడు విజయవాడ రోడ్లపై వెలిశాయి. వైసీపీ వర్గాలు ఈ క్లిప్పింగులు బహిర్గతం చేశారా మరెవరైనా అనేది తెలియకపోయినా..ఎన్టీఆర్ అవసరం ఎవరికి లేదు..ఎవరు ఎన్టీఆర్‌ను దూరం పెట్టాలనుకున్నారనేది ప్రజలకు అర్ధమౌతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ వాదిస్తున్నట్టుగానే ఎన్టీఆర్ పేరును, ఖ్యాతిని తొలగించాలనే చంద్రబాబు ఆలోచనకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ పేపర్ క్లిప్పింగ్. 


మొత్తానికి జగన్ ట్రాప్‌లో బాబు పడ్డారనేది మరోసారి స్ఫష్టమైంది. అందుకే నాటి ఘటనలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏకంగా ఎన్టీఆర్ అవసమే మాకు లేదంటూ దెక్కన్ క్రానికల్ పేపర్‌కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్యూ క్లిప్పింగులు ఇప్పుడు అందుకే విజయవాడ, మరికొన్ని ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. 


Also read: Tirupathi Fire: తిరుపతి చిన్నపిల్లల హాస్పిటల్ లో మంటలు.. డాక్టర్ మహా ముగ్గురు దుర్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook