భారత సైన్యం అంత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఈ రోజు తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ స్ట్రైయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భారత వైమానిక దశం బాంబుల వర్షం కురిపించగా 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతికారం తీర్చుకునే క్రమంలో ఈ రోజు భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన ఉగ్రమూకలను మట్టుబెట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా ఘటనపై దేశంలోని పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇరువురు ఖండించారు.  ఉగ్రవాదుల భరతం పట్టిన భారత వాయుసేన శక్తికి జేజేలు పలుకుదామని ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొనగా...ఉగ్రవాదుల మట్టుబెట్టిన మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.