హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం తీరుపై మరోసారి మండిపడ్డారు. ఈ సందర్భంలో కోర్టు విభజనను జగన్ కేసుతో ముడిపెట్టి ఆరోపణలు సంధించారు. ఓ ప్రముఖ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కేసు విచారణలో జాప్యానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఐ కోర్టు విభజన జరిగితే...


ఉమ్మడి హైకోర్టుని విభజించిన కేంద్రం..ఇప్పుడు సీబీఐ కోర్టును కూడా విభిజించాల్సి ఉంది. దీంతో జగన్ కేసు మరుగునపడుతుందని సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. సీబీఐ కోర్టు విభజన జరిగితే..విచారణ దశలో ఉన్న ప్రస్తుత కేసులన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశముందని...దీంతో జగన్ కేసు విచారణలో కూడా జాప్యం జరుగుతుందన్నారు. కనీసం ఎన్నికల ముసిగే వరకు జగన్ కేసు సాగదీయాలనే ఉద్దేశంతోనే జగన్ తో కలిసి కేంద్రం ఇలాంటి ఎత్తుగడ వేసిందని చంద్రబాబు ఆరోపించారు. 


ఐదు రోజుల్లో ఏం చేయగలం..


హైకోర్టు విభజన నిర్ణయంపై చంద్రబాబు మాట్లాడుతూ హైకోర్టును ఎలా తరలించగలమని ప్రశ్నించారు. ఇక్కడ హైకోర్టు నిర్మాణం పూర్తి కాలేదు..పైగా ఉద్యగులు మానసికంగా సిద్ధపడాటాని సమయం కావాలి..ఇవన్నీ ఆలోచించకుండా హడావుడిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుల చేయించిందని చంద్రబాబు విమర్శించారు. ఈ వ్యవహారం కూడా రాష్ట్ర విభజన లాంటి షాక్ నని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


వైపీపీ కౌంటర్ ఎటాక్


కాగా చంద్రబాబు విమర్శలను వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. రాష్ట్రంలో ఏం జరిగినా అది జగన్ తో ముడిపెట్టి ఆరోపణలు సంధిచండం చంద్రబాబుకు అలవాటుగామారిందని దయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని.. న్యాయస్థానాలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని..అలాంటి అతి తెలివితేటలు తమకు లేవని వైసీపీ శ్రేషులు చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.