కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖర్చు చేయలేదని బీజేపీ అధికార ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా వారు కాగ్ వెల్లడించిన వివరాలను బహిర్గతం చేశారు. రాజధాని నగరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రహదారులు తదితర అంశాలకు కేంద్రం ఇచ్చిన గ్రాంటులో రాష్ట్రం కనీసం రు.1,972 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అని తెలిపారు. అలాగే మద్యాహ్న భోజన పధకానికి కేంద్రం కేటాయించిన రు.163.95 కోట్లలో రు.95 కోట్లు మాత్రమే వినియోగించారు అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే వెనుకబడిన జిల్లాల వికాసానికి ఏ ప్రాజెక్టు చేపట్టకుండా.. 7 జిల్లాల్లో చంద్రన్న తోఫా, సంక్రాంతి  కానుక వంటి వాటికి నిధులు మళ్లించారని.. అలా నిధులు మళ్లించి ఖర్చు చేసేశాం అనడం ఎంతవరకు సబబు అని అమిత్ షా ఇటీవలే ప్రశ్నించారని బీజేపీ ప్రతినిధులు తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులలో 12 శాతం మాత్రమే ఖర్చు చేశామన్నది అబద్ధమని.. 92 శాతం ఖర్చు చేశామన్నది నిజమని చెబుతున్న చంద్రబాబు మాటల్లో సత్యం లేదని తెలిపారు.