Chandrababu naidu phone call to ex cm ysjagan: దేశంలో ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికలలో వినూత్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చారు. ఎగ్జీట్ పోల్స్ కు సైతం దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకి కేవలం 240 స్థానాలు వచ్చే విధంగా చేశారు. బీజేపీ ఇండిపెండెంట్ గా కనీసం మ్యాజిక్ ఫిగర్ 272 చేరుకోలేపోయింది. ఇక ప్రభుత్వంను ఏర్పాటు చేసేందుకు మోదీ మిత్రపక్షాల మీద ఆధార పడాల్సి వచ్చింది. దీంతో ఎన్డీయే 293 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ను ఏర్పాటు చేసింది. మోదీ మూడోసారి ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హజరయ్యారు. పదివేల మంది వరకు కూడా ప్రజలు, కార్యకర్తలు  హజరైనట్లు తెలుస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ఏర్పాటులో ఏపీ చంద్రబాబు,బీహర్ నితీష్ కుమార్ కీలకంగా మారారని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


ఈ నేపథ్యంలోనే మోదీ 3.0 కేబినేట్ లో ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఇక మరోవైపు రేపు (బుధవారం) కేసన పల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును, కూటమి నేతలు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసి, గవర్నర్ కు తెలియజేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వనించారు. మోదీప్రమాణ స్వీకారానికి మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు హజరుకానున్నారు. అదే విధంగా.. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బన్నీలు, జూనియర్ ఎన్టీఆర్ లనుసైతం చంద్రబాబు ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పారు.


ఇక మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు స్వయంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం అందుబాటులోకి రాలేదని తెలుస్తొంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే వైఎస్ జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.


Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు వైఎస్ జగన్ వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో దిగి.. కేవలం 11 స్థానల్లో మాత్రమే గెలిచి, అపోసిషన్ హోదా కూడా లేకుండా బొక్క బొర్లా పడ్డారు. ప్రజలు ఇచ్చిన షాకింగ్ ఎన్నికల ఫలితాల నుంచి వైసీపీ శ్రేణులు ఇప్పటికీ కోలుకోలేదని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ శ్రేణులు తమమీద దాడులు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ, గవర్నర్ కు ఫిర్యాదులుసైతం చేశారు. టీడీపీ రివేంజ్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, అందువల్లనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter