Chandrababu Kadapa Tour: జగన్ ఇలాకాలో గర్జించిన చంద్రబాబు.. నియంతను తరిమికొడతామని వార్నింగ్
Chandrababu Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్ని రోజులుగా జిల్లాలు తిరుగుతున్న చంద్రబాబు... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో సింహగర్జన చేశారు.
Chandrababu Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్ని రోజులుగా జిల్లాలు తిరుగుతున్న చంద్రబాబు... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో సింహగర్జన చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు కంచుకోటగా చెప్పుకునే కడపలో టీడీపీ సమావేశానికి భారీగా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన చంద్రబాబు.. నియంత పాలన సాగిస్తున్న జగన్ కు జనాలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ గర్జించారు.
టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లిందన్నారు చంద్రబాబు. ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుందని అన్నారు. మూడేళ్లలోనే ఏపీ జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటూ.. ప్రజలుపై భారం మోపుతున్నారని అన్నారు. దేశంలో చెత్తపై పన్ను వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శించారు. పెట్రోల్ , గ్యాస్ పై బాదుడే బాదుడు స్కీం పెట్టారన్నారు. కనీసం రోడ్లకు మరమ్మత్తులు చేసే స్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. కరెంట్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచి జనాల నడ్డివిరిచారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితులే ఉన్నాయన్న చంద్రబాబు.. రాజపక్సేకు పట్టిన గతే జగన్ కు పట్టబోతుందన్నారు. కనీసం కడప జిల్లాకు కూడా ఏమి చేయలేదన్నారు. దీపం పథకం కింద తాము వంట గ్యాస్ ఇస్తే.. ఆ దీపం ఆర్పేసిన దుర్మార్గుడు జగన్ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం ఒంగోలులో స్టేడియం ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. ఎవడి అబ్బ సొబ్బని తమకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు.తాను ఎంతో మంది డిక్టేటర్లను, నియంతలను చూశానని చెప్పారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. గతంలో తాను టార్గెట్ చేయాలని చూస్తే.. ఇడుపులపాయ దాడి జగన్ బయటికి వచ్చేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సర్కార్ అరాచకాలను ప్రజలు గమనించాలని.. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఇక కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉత్సాహంగా సాగింది. కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు.
READ ALSO: AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత, జీఏడీ రిపోర్టుకు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook