AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత, జీఏడీ రిపోర్టుకు ఆదేశాలు

AP Government: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు తొలగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2022, 12:20 PM IST
  • ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
  • జీఏడీకు రిపోర్టు చేయాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగిసిన ఏబీ సస్పెన్షన్ వేటు
 AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత, జీఏడీ రిపోర్టుకు ఆదేశాలు

AP Government: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు తొలగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

అధికార దుర్వినియోగం, ఇజ్రాయిల్ నుంచి రక్షణ పరికరాల కొనుగోలు కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు అనేది రెండేళ్లకు మించకూడదు. సస్పెన్షన్ వ్యవధి రెండేళ్లు దాటితే ఆ సస్పెన్షన్ ముగిసినట్టే భావించాలి. ఈ నిబంధన మేరకే సుప్రీంకోర్టు ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ తొలగించింది. అతనిని సర్వీసులో తీసుకోవడమే కాకుండా..సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా పరిగణిస్తూ జీతాలు చెల్లించాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తీసుకుని ఛీఫ్ సెక్రటరీ కార్యాలయానికి ఏబీ వెంకటేశ్వరరావు రెండుసారు వెళ్లినా సీఎస్ అందుబాటులో లేరు. తనను విధుల్లో తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాల్ని జత చేసి ఏపీ ఛీఫ్ సెక్రటరీ కార్యాలయంలో సమర్పించారు. ఫలితంగా ఏపీ ప్రభుత్వం అతనిపై నిషేధాన్ని ఎత్తివేసి..జీఏడీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటటేశ్వరరావు సర్వీసును రీ ఇన్‌స్టేట్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 

Also read: Inter Weightage Marks: ఏపీలో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News