CM CHANDRABABU: చంద్రబాబు సంచలనం.. కేబినెట్‌నుంచి నలుగురు ఔట్?
CM CHANDRABABU: ఏపీ కేబినెట్‌లో మార్పులు- చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా..! మంత్రివర్గం నుంచి నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమయ్యారా..! ఇందులో జనసేన మంత్రికి కూడా షాక్ ఇవ్వబోతున్నారా..! అటు బీజేపీ నేతకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! ఇంతకీ బాబు కేబినెట్ నుంచి భర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు..!
CM CHANDRABABU: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పాటై దాదాపు ఆర్నెళ్లు దాటింది. దాంతో సీఎం చంద్రబాబు తన కేబినెట్‌లోని మంత్రులకు మార్కులు వేస్తున్నారు. మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది.. పనిచేయని మంత్రులు ఎవరని నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని నలుగురు మంత్రులపై వేటు పడే చాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరూ మంత్రులను సీఎం చంద్రబాబు హెచ్చరించినా.. ప్రయోజనం లేకపోవడంతో వేటు తప్పకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే వీరి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నారని చెబుతున్నారు..
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే చాన్స్ ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు. త్వరలోనే నాగబాబు చేత మంత్రిగా ప్రమాణం చేయిస్తారట. అయితే నాగబాబు ప్రమాణంతో పాటు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉన్నది ఒకే పదవి కావడంతో ఇద్దరికి ఎలా అవకాశం ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధించికున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుతారని పార్టీ పెద్దలు చెప్పడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అయ్యారట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవక ముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటని గుసగుసలాడుకుంటున్నారట. ఇదే సమయంలో కేబినెట్ నుంచి ఔట్ అయ్యే మంత్రి ఎవరని ఆరా తీస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు పట్టుబట్టిమరి ప్రమోషన్ ఇచ్చానా సరిగ్గా పనిచేయడం లేదని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారట.. ఇటీవల పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్‌లోనూ అందరికంటే వెనుకబడ్డారని చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. అయినా ఆయన మాత్రం.. సరిగ్గా పర్మార్మెన్స్ చూపించడం లేదని చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిపై కూడా వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు.. ఆయన స్థానంలోనే పల్లా శ్రీనివాస్ రావుకు చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు సైతం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..
తాజాగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలిసింది. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో జనసేన మంత్రుల సంఖ్య ఐదుకు చేరింది. అటు బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి.. బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండటంతో బదిలీ చేస్తారని చెబుతున్నారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండటంతో.. ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు..
మొత్తంగా కూటమి సర్కార్‌లో నలుగురు మంత్రులపై వేటు పడటం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఏ మంత్రికి ఉద్వాసన పలుకుతారనేది మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. జనసేన పార్టీ నుంచి మంత్రికి భర్తరప్ చేస్తే.. పవన్ కల్యాణ్ ఊరుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.. ఒకవేళ దీనికి జనసేనాని ఒప్పుకోకుంటే ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు..
Also Read: Palla Srinivas Rao: కేబినెట్‌లోకి పల్లా శ్రీనివాస్ రావు!
Also Read: DK Aruna: రేవంత్ అడ్డాలో డీకే అరుణ హల్‌చల్.. లగచర్ల రైతులకు పరామర్శ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.