Punganuru Violence News: పుంగనూరులో బీభత్సం.. చంద్రబాబు సభలో పోలీసులపై దాడులు
SP Rishnath Reddy Press meet About Punganuru Violence: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ఎస్పీ హెచ్చరించారు.
SP Rishnath Reddy Press meet About Punganuru Violence: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు పర్యటన, కార్యక్రమం ప్రకారం పుంగనూరులోనికి రావడానికి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. వారు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం పుంగనూరులోనికి రాకుండా హైవేపైనే కార్యక్రమం ముగించుకుని చిత్తూరుకు వెళ్ళాల్సి ఉంది అని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం పుంగనూరులో జరిగిన పరిణామాలపై రాత్రి మీడియాతో మాట్లాడిన ఎస్పీ రిశాంత్ రెడ్డి.. అక్కడి పరిస్థితిని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని తగిన పోలీసు బందోబస్తుతో బ్యారికేడ్లను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసుల నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా కొంతమంది అల్లరి మూకలు దౌర్జన్యంగా పుంగనూరులోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతమంది అల్లరిమూకలు ముందుగానే తెచ్చుకున్న బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో పోలీసుల పైకి దాడికి పాల్పడ్డారు అని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.
సుమారు 2000 మంది అల్లరి మూకలు చాల అమానవీయంగా దాడి చేసారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే పోలీసులపై దాడులు జరిగాయి అని ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆరోపించారు. వారిని అడ్డుకునే క్రమంలో మొదటగా బాష్ప వాయువు ప్రయోగించిన తరువాతే అప్పటికే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది అని అన్నారు. లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ అల్లరి మూకలు ఏ మాత్రం తగ్గకుండా పోలీసులపై ఇష్టమొచ్చినట్టు విచక్షణా రహితంగా కర్రలు, రాళ్ళతో దాడి చేసి పోలీసులని తీవ్రంగా గాయపరిచారు అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి : YS Avinash Reddy: నాపై కుట్ర జరుగుతోంది.. వైఎస్ వివేకా హత్య కేసుపై అవినాష్ ఆరోపణలు
పుంగనూరులో అల్లరిమూకలు రెచ్చిపోయి మరీ విచక్షణారహితంగా చేసిన దాడిలో 50 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. అందులో 13 మంది పోలీసులకి తీవ్ర గాయాలయ్యాయి. 2 పోలీసు వాహనాలను ద్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు. దాడి చేసిన అల్లరి మూకలపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటాం. గాయాలైన పోలీసులను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకునే విధంగా మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి : CM Jagan Mohan Reddy: క్షేత్రస్థాయిలోకి సీఎం జగన్.. వరద బాధితుల వద్దకు నేరుగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి