Chintakayala Ayyanna Patrudu: నర్సీపట్నంలో అర్ధరాత్రి హైడ్రామా.. మాజీ అయ్యన్న పాత్రుడు అరెస్ట్
Chintakayala Ayyanna Patrudu And Son Rajesh Arrest: ఇంటి గోడ కూల్చివేత వివాదంలో నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున చడిచప్పుడు లేకుండా అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.
Chintakayala Ayyanna Patrudu And Son Rajesh Arrest: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆయనతో పాటు కొడుకు రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అయ్యన్న ఇంటికి వచ్చిన పోలీసులు.. నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇంటి గోడ కూల్చివేత వివాదంలో కోర్టుకు ఫోర్జరీ డాక్యుమెంట్స్ సమర్పించారని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ1గా అయ్యన్న పాత్రుడు, ఏ2గా విజయ్, ఏ3గా రాజేష్ పేర్లను పోలీసులు చేర్చారు. గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. అయ్యన్నకు నోటీసులు అందజేశారు. అనంతరం అయ్యన్నతో పాటు రాజేష్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిని ఏలూరు కోర్టులో హాజరపరచున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో తెలిపారు. పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
సీపీడీ పోలీసులపై అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు దొంగల్లా గోడ దూకి వచ్చి ఇంట్లోకి వచ్చారని ఆరోపించారు. తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు రాజేష్ తలుపులు తీసి ఏం కావాలని అడిగాడని.. పోలీసులు ఏం చెప్పకుండా ఈడ్చుకుంటు వెళ్లారని ఆరోపించారు. స్వామి మాలలో ఉన్నా పోలీసులు దుర్భాషలాడుతూ దారుణంగా వ్యవహరించారన్నారు. తన భర్త అయ్యన్న పాత్రుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నా.. ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారని చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకునివ్వకుండా తీసుకుని వెళ్లిపోయారని.. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందన్నారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వామే బాధ్యత వహించాలని పద్మావతి అన్నారు.
పంట కాలువ ఆక్రమించి తన ఇంటికి ప్రహరీ నిర్మించారని అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద వివాదం నెలకొంది. ఆ గోడ కూల్చి వేసుందుకు అధికారులు సిద్ధమవ్వగా.. అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ తరువాత అయ్యన్న పాత్రుడు హైకోర్టును ఆశ్రయించగా.. ఊరట లభించింది. అదే కేసులో అయ్యన్న నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించారని పోలీసులు ఆయనతోపాటు కొడుకు రాజేష్‌ను అరెస్ట్ చేశారు.
Also Read: Munugodu Polling: మునుగోడు పోలింగ్‌కు సర్వం సిద్ధం, ఓటర్లు ఎంతమంది, పోలింగ్ సిబ్బంది
Also Read: పవన్ వెంట అనుమానాస్పద వ్యక్తులు.. కారు, బైక్లపై ఫాలో అవుతూ అర్ధరాత్రి పంచాయితీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook