Visakha MLC By Elections: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పోటీ నుంచి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు. పార్టీ నాయకులతో చర్చించిన ఆయన.. పోటీ విషయంపై చర్చించారు. విజయం సాధించేందుకు అవసరమైన బలం లేని నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయం తెలుసుకున్న చంద్రబాబు.. ఈ మేరకు పోటీకి దూరంగా ఉందానమి చెప్పారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. అయితే హుందా రాజకీయాల చేద్దామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసుకోండి..


ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు  ఉన్నారు. గెలుపు కోసం 420 ఓట్లు కావాలి. అయితే కూటమికి అన్ని కలుపుకుంటే 300 వరకు ఓట్లు అవుతాయి. వైఎస్సార్‌సీపీకి 538 మంది ఓటర్ల బలం ఉంది. కూటమి గెలుపు కోసం 120 ఓట్లు సమీకరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి తీసుకువచ్చి.. గెలుపు కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదేని మెజారిటీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ఒక్క సీటుతో వచ్చే అదనపు ప్రయోజనం కూడా ఏం లేదని చెప్పారు.


అయితే ముందుగానే అలర్ట్ అయిన వైసీపీ క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. తమ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించి.. ఓట్లు పక్కకు పోకుండా క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ తీసుకువెళ్లింది. కుటుంబాలతో పాటు కొంతమందిని దక్షిణ భారత యాత్రలకు.. మరికొంతమందిని బెంగుళూరుకు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. నేడు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కాగా.. ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇక కూటమి పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీకి టెన్షన్ తగ్గిపోయింది. బొత్స ఎమ్మెల్సీకి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. 


Also Read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.