Sachivalaya System: మళ్లీ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు.. సీఎం చంద్రబాబు ఫోకస్
CM Chandrababu Plans To Reorganization Sachivalaya System: గ్రామ వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు సీఎం సమీక్ష చేపట్టారు.
Sachivalaya System: రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన గ్రామ - వార్డు సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం దిద్దుఇబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి.. మరింత అర్థవంతంగా.. పటిష్టంగా ఈ వ్యవస్థను తయారు చేయాలని భావిస్తోంది. ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు సమగ్రంగా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: YS Sharmila: సముద్రంలో పవన్ కల్యాణ్ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి
ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సీఎం జీఎస్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష చేశారు. గ్రామాల్లో.. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై.. మెరుగైన సేవలు అందించాలనే దానిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. సచివాలయ వ్యవస్ధ పునర్‌వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన మొదటి సమావేశంలో వ్యవస్థ పనితీరు.. ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
Also Read: New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉందా, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
సచివాలయ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతోపాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవస్ధను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు.. ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపైన చర్చించారు. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని స్పష్టం చేశారు. అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్థుబాటు, శిక్షణ వారికి ఇవ్వాలని సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.
సచివాలయాలు తక్కువ
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు 13,291 ఉండగా గ్రామ సచివాలయాలు మాత్రం కేవలం 11,162 సచివాలయాలు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ-వార్డు సచివాలయాలు ఉండగా వీటిలో 1,19,803 మంది ఉద్యోగులను నేరుగా నియమించారు. ఇతర విభాగాల వారిని కలిపితే 1,27,175 మంది గ్రామ-వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 95,533 మంది, వార్డు సచివాలయాల్లో 31,592 మంది ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత కసరత్తు జరిపి ప్రభుత్వం ఈ విభాగంపై ముందడుగు వేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.