IPL Team For AP: ఏపీకి ఐపీఎల్ టీమ్.. క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ సాయం
CM Jagan Review Meeting: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
CM Jagan Review Meeting: ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ టీమ్ ఉండేలా చూడాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మార్గనిర్దేశం చేయనుందని తెలిపారు. రాష్ట్రంలో మూడు స్టేడియాలను సీఎస్‌కేకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. క్రికెట్ శిక్షణ కార్యక్రమాల కోసం ఈ మైదానాలను వినియోగించనున్నారని చెప్పారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు రాష్ట్ర యువకులకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. జట్టును నిర్మించేందుకు వీరి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ముంబై ఇండియన్స్ వంటి జట్ల సాయం కూడా తీసుకుంటామన్నారు.
"ఆడుదాం ఆంధ్ర" పేరుతో ప్రతి ఏటా క్రీడా సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ప్రతి మండలంలో స్పోర్ట్స్ స్డేడియాలు ఏర్పాటు చేసి.. గ్రామస్థాయిలో ఆడే ఆటగాళ్లకు అవసరమైన క్రీడా సామత్రి అందజేయాలని సూచించారు. అదేవిధంగా సచివాలయాలకు కూడా భవిష్యత్‌లో కిట్లు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కలిశాడు. టీమిండియా తరుఫున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన కేఎస్ భరత్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్‌లతో కూడా టీ షర్ట్‌ను సీఎం జగన్‌కు అందించాడు కేఎస్ భరత్.
అనంతరం ఈ యంగ్ వికెట్ కీపర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ అయిన తరువాత ఏపీ నుంచి టీమిండియా తరఫున ఆడే అవకాశం తనకే వచ్చిందన్నాడు. టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉందని చెప్పాడు. ఈ విషయాలు అన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నానని.. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపాడు. దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారని పేర్కొన్నాడు. రాష్ట్రంలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని.. అలాగే స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బాగుందని మెచ్చుకున్నాడు. ప్రభుత్వం తరుఫున ప్రోత్సాహం ఇలానే ఉంటే.. భవిష్యత్‌లో చాలా మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డాడు.
Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..
Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి