Andhra Pradesh IPL Team: ప్రపంచ వ్యాప్తంగా ఏ లీగ్‌కు లేనంత క్రేజ్ ఐపీఎల్‌కు ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కితే చాలు అని ఎందరో క్రికెటర్లు కలలు కంటున్న క్యాష్ లీగ్ ఇది. ఇక లీగ్‌ను వీక్షించే ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఐపీఎల్ జరిగే రెండు నెలలు టీవీలు, సెల్‌ఫోన్లు, ట్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతారు. తెలుగు రాష్ట్రాలలో క్రికెట్‌ను ఎంత అమీతంగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఐపీఎల్‌ టీమ్‌ను రెడీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐపీఎల్‌లో ఏపీ జట్టు ఎంట్రీకి రూట్ మ్యాప్ రెడీ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఐపీఎల్‌లో పది జట్లు ఆడుతున్నాయి. గతంలో 8 జట్లు ఉండగా.. ఆ తరువాత జట్ల సంఖ్య 10కి పెంచారు. కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ మరోసారి అవకాశం కనిపించే సూచనలు ఉన్న తరుణంలో ఏపీ తరుఫున బిడ్డింగ్‌ దక్కించుకునేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ మేరకు స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐపీఎల్‌కు భారీగా క్రేజ్‌ పెరిగిపోయిందని.. ఇలాంటి ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లు ఆడేందుకు యువత ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఫ్రాంచైజీ జట్టు ఉంటే.. మన రాష్ట్రంలోని ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఇదే ఆలోచనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి‌ ఏసీఏ ముందుంచారని.. ఐపీఎల్ జట్టు కోసం రోడ్‌మ్యాప్‌ తయారు చేయాలని ఆదేశించారని.. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.  


ఐపీఎల్ ఫ్రాంచైజీ అంటే కోట్లతో వ్యవహారం అని.. కేవలం ప్రైవేట్ సంస్థలు మాత్రమే పాల్గొనే టోర్నీ అని ఆయన అన్నారు. ఇందులో గుర్తింపు సంఘాలు గానీ.. ప్రభుత్వ ప్రమేయం గానీ ఉండకూడదన్నారు. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లను ప్రకటించాలని బీసీసీఐను ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కోరుతున్నాయని అన్నారు. బీసీసీఐ పర్మిషన్ ఇస్తే.. అందులో మన రాష్ట్ర జట్టు ఉండేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. బిడ్డింగ్‌ దక్కించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏపీ జట్టుకు విశాఖ పిచ్ హోమ్ గ్రౌండ్ అవుతుందన్నారు. 


Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   


Also Read: Amazing Dance With Fingers: చేతివేళ్లతోనే డాన్స్ ఇరగదీశాడు పో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి