CM Jagan Releases Welfare Calendar 2023–24: జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ (2023–24)ను సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ.2,96,148.09 కోట్లు అని వెల్లడించారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> ఏప్రిల్‌ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం


==> మే 2023 – వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా


==> జూన్‌ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి


==> జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)


==> ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర


==> సెప్టెంబర్‌ 2023 – వైఎస్సార్‌ చేయూత


==> అక్టోబర్‌ 2023 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)


==> నవంబర్‌ 2023 – వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)


==> డిసెంబర్‌ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి


==> జనవరి 2024 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)


==> ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం


==> మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు


Also Read:  Delhi Metro Video: మెట్రోలో జంట ఘాటు రొమాన్స్.. లిప్‌ కిస్ వీడియో చూస్తే ప్యూజులు అవుట్


Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి