Couple Lip Kiss in Delhi Metro: మొన్న బికినీ అమ్మాయి.. ఈ రోజు జంట ఘాటు రొమాన్స్.. ఢిల్లీ మెట్రోలో ఆగని జనాల ఆగడాలు

Delhi Metro Couple Lip Kiss Video: ఢిల్లీ మెట్రో రైలు ఓ జంట రెచ్చిపోయింది. అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా రొమాన్స్‌లో ముగినితేలారు. అంతేకాదు లిప్ కిస్ చేసుకుంటూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 08:47 PM IST
Couple Lip Kiss in Delhi Metro: మొన్న బికినీ అమ్మాయి.. ఈ రోజు జంట ఘాటు రొమాన్స్.. ఢిల్లీ మెట్రోలో ఆగని జనాల ఆగడాలు

Delhi Metro Couple Lip Kiss Video: ఇటీవల ఢిల్లీ మెట్రో గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. మెట్రోలో బికినీలు వేసుకుని ప్రయాణిస్తున్న యువతుల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ జంట మెట్రోలో లిప్ కిస్ పెట్టుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రన్నింగ్ మెట్రోలో ఓ జంట బహిరంగంగా రొమాన్స్ చేస్తోంది. యువకుడు, యువతి మెట్రో ట్రైన్‌లో నిలబడి బహిరంగంగా హాగ్ చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా.. లిప్ టు లిప్ కిస్ కూడా పెట్టుకున్నారు. పక్కన అందరూ చూస్తున్నారని తెలిసినా.. ఏ మాత్రం భయపడకుండా ఆ జంట రెచ్చిపోయింది. వీరిద్దరి రొమాన్స్‌ను ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇక అంతే.. ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారో అనే విషయంపై క్లారిటీ రాలేదు. 

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఢిల్లీ మెట్రో నుంచి ప్రతిరోజూ ఇలాంటి వీడియోలు, ఫొటోలు వస్తున్నాయి.. పిల్లలతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడలేకున్నాం. పాటలు వినలేకున్నాం.. ఇప్పుడు మెట్రోలో కూడా ప్రయాణించే పరిస్థితి లేకుండా పోయింది..' అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. 'ఈ వ్యక్తులు ఏ భూమి నుంచి వచ్చారు. మెట్రోలో కెమెరాలు ఉన్నప్పుడు అధికారులు బయటకు వెళ్లే సమయంలో ఎందుకు ఆపడం లేదు..' అని ప్రశ్నిస్తున్నారు. యువతకు నిజంగా ప్రేమకు అర్థం తెలియదని.. ప్రేమ ఇప్పుడు కేవలం కామం మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా ఇటీవల బికినీ ధరించి యువతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. రద్దీగా మెట్రోలో ఓ యువతి బికినీ ధరించి ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టూ పీస్ డ్రెస్‌ ధరించి.. ఓ బ్యాగ్ అడ్డుగా పెట్టుకుని ప్రయాణించింది. ఆమె ట్రైన్‌ నుంచి దిగిపోయే సమయంలో ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్ట్ పెట్టారు. ఆ వీడియో తరువాత ఢిల్లీ మెట్రలోనే జంట రొమాన్స్ వీడియో వైరల్ అయింది.

Also Read:  CM Jagan: సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్.. నెలల వారీగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇవే..

Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News