CM Jagan Inspects Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టును మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించిన సీఎం.. అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులను పురోగతిని అధికారులు వివరించారు. వరద విపత్తను తట్టుకునేందుకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన అనంతరం ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాంను వద్దకు వెళ్లారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళిక లోపంతో దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ ప్రాంతాన్ని జగన్ పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఇసుకను నింపే పనులను అధికారులు వివరించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని సీఎం జగన్‌కు వెల్లడించారు అధికారులు. రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. కాంపౌండ్‌ వారీ బిల్లుల చెల్లింపులతో ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని చెప్పారు. గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపిస్తున్నారని అన్నారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని.. ఈ ఖాళీల గుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడంతో ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 


"ESRF డ్యామ్‌ నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతింది. దీంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అంతేకాదు రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించేశారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి.." అని సీఎం జగన్ సూచించారు. 


Also Read: IND vs AUS Dream11 Prediction Today: ఆసీస్‌తో ఫైనల్‌ ఫైట్‌కు భారత్ రెడీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్, హెడ్ టు హెడ్ రికార్డులు..!  


దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తయితే.. మెయిన్‌ డ్యామ్‌ పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అధికారు స్పందిస్తూ.. డిసెంబర్‌ కల్లా పనులు పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.


Also Read: UPI Cash Withdrawal: ఏటీఎంలో యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోండి..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook