AP Police Seva App: ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం తాజాగా పోలీస్ శాఖపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త పోలీస్ యాప్ (AP Police Seva App)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
దేశంలోనే తొలిసారిగా ఏపీలో పోలీస్ శాఖ సరికొత్త సేవా యాప్ (#APPoliceSevaApp)ను ప్రారంభించింది. పరిపానలో పలు సంస్కరణలు, సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం తాజాగా పోలీస్ శాఖపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త పోలీస్ యాప్ (AP Police Seva App)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుంధానిస్తూ రూపొందించిన ఈ పోలీస్ యాప్‌లో 87 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు.
ఇకనుంచి ప్రతికేసును పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయకుండా యాప్ ద్వారా ఫిర్యాదు చేసి రశీదు పొందవచ్చునని తెలిపారు. యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులను తగ్గిస్తూ, పోలీసులు అందించే సేవలను ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశంతో పాటు ఎమర్జెన్సీ సమయంలో వీడియో కాల్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
‘దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చునని’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రతి కేసు అవసరాల కోసం బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఏపీ పోలీస్ సేవ యాప్ తగ్గిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ను తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్‌శాఖను అభినందించారు.
ఫొటో గ్యాలరీలు
Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. Photos
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe