Tirumala Declaration: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani About Tirumala Declaration) ప్రశ్నించారు.

Last Updated : Sep 20, 2020, 07:17 PM IST
Tirumala Declaration: ఏపీ మంత్రి కొడాలి నాని  సంచలన వ్యాఖ్యలు

తిరుమల డిక్లరేషన్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీవారి గుడికి సంతకం పెట్టకుండా వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా అని అడిగారు. అసలైన హిందూవాదులు, తమ మతం కోసం జీవితాన్ని కేటాయించిన వ్యక్తుల నుంచి ఏ అభ్యంతరాలు లేవని వ్యాఖ్యానించారు.  AP: తాజాగా 7,738 కరోనా కేసులు

డిక్లరేషన్ (Tirumala Declaration) అనే అంశంపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. డిక్లరేషన్ అనేది కేవలం రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనని పేర్కొన్నారు. అందుకే ఆ విధానం తీసేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్లే వ్యక్తులను డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్నారు. ఏపీలో ఇతర ఆలయాలు, మసీదులు, చర్చిలలో లేని సంప్రదాయం తిరుమలలో మాత్రం ఎందుకు తీసుకొచ్చారు, ఆ పద్ధతిని తొలగించాలని అభిప్రాయపడ్డారు. Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

కాగా, అన్య మతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాల్సిన నేపథ్యంలో.. తమకు శ్రీవారిపై, హిందూ మతంపై విశ్వాసం ఉందని పేర్కొంటూ డిక్లరేషన్ సంతకం చేయాలి. అలా అయితేనే తిరుమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు.  Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్ 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News