అమరావతి: రాష్ట్రంలో నిత్యం పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) నేడు (సెప్టెంబర్ 22న) ఢిల్లీలో పర్యటించనున్నారు.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో అమిత్‌ షా తో ఏపీ సీఎం భేటీ కానున్నారు. Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, నేటి రాత్రికి వైఎస్ జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం. బుధవారం (సెప్టెంబర్ 23న) ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తిరుపతి వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఏపీ సీఎం బస చేయనున్నారని తెలుస్తోంది. మరుసటి రోజు కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి వైఎస్ జగన్ పాల్గొంటారు.  AP Police Seva App: ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 


కాగా, దేశంలోనే సరికొత్తగా ఏపీ పోలీస్ సేవా యాప్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఏపీ పోలీస్ సేవా యాప్‌ను ఆవిష్కరించడం తెలిసిందే. ఆ మరుసటిరోజు ఆయన ఢిల్లీలో పర్యటించి.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.  Tirumala Declaration: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe