Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షలు దాటింది. గత 24గంటల్లో ( బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు ) 77,492 శాంపిళ్లను పరీక్షించగా.. 8,702 కరోనా కేసులు నమోదు కాగా.. 72 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,01,462 కి చేరుకోగా.. ఇప్పటివరకు 5,177 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: Vijayawada Flyover: కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 88,197 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 5,08,088 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 48,84,371 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..


[[{"fid":"193365","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap corona bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap corona bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"ap corona bulletin","title":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం