కరోనా వైరస్ ( Coronavirus ) నియంత్రణకు మంత్రం ఒక్కటే. ట్రేస్ ( Trace ) , టెస్ట్ ( Test ) , ట్రీట్మెంట్ ( Treatment ). త్రిబుల్ టి ఫార్ములా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) ఇదే అవలంభించింది. అందుకే కొత్త కేసల సంఖ్య రోజుకు పదివేల నుంచి 2 వేలకు పడిపోయింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా కరోనా కేసులు ( Corona cases ) ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న పరిస్థితి.  ఈ నేపధ్యంలో మొన్నటివరకూ దేశంలోనే టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య  భారీగా తగ్గుతోంది. దాదాపు నెల రోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఓ సమయంలో భారీగా నమోదవుతున్న కేసులతో అంటే రోజుకు 10-11 వేల కేసులతో ఆందోళన కల్గించిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాల్నిస్తున్నాయి. 


ట్రేస్, టెస్ట్, ట్రీట్మెంట్ లో భాగంగా భారీగా పరీక్షల నిర్వహిస్తోంది. ఇప్పటికీ రోజుకు 50-70 వేల మధ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి ఏపీలో. ఓ నెల రోజుల క్రితం వరకూ రోజుకు 10-11 వేల కొత్త కేసులు వెలుగుచూస్తుండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమక్రమంగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. నిన్నటివరకూ రోజుకు 3 వేల  కేసులు నమోదవుతూ పరిస్థితి ఆశాజనకంగా మారింది. గత 24 గంటల్లో అయితే మరింతగా తగ్గి కేవలం  19 వందల కేసునే నమోదయ్యాయి. 


ఏపీ ( Ap ) లో గత 24 గంటల్లో 51 వేల 544 కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests ) నిర్వహించగా కేవలం 19 వందల పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 8 వేల 924కు చేరుకుంది. అటు కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 19 మంది మరణించగా మొత్తం 6 వేల 606 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు యాక్టివ్ కేసులు కూడా రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ కావడం దీనికి కారణం.  గత 24 గంటల్లో 3 వేల 972 మంది కోలుకోగా రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7 లక్షల 73 వేల 548కు చేరుకుంది.  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 28 వేల 770 ఉండటం విశేషం.  కరోనా వైరస్ సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ పరీక్షలపైనే దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం 76 లక్షల 21 వేల 896  పరీక్షలు నిర్వహించింది.  Also read: AP: కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష