Who Will Not Receive The Coronavirus Vaccine | న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వర్చువల్ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం దేశవ్యాప్తంగా 3,006 ప్ర‌దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కొక్క కేంద్రంలో 100 మందికి చొప్పున మొత్తం మూడు లక్షల మందికి కోవిడ్ టీకాను ఇవ్వనున్నారు. ఈ భారీ వ్యాక్సినేషన్ (COVID-19 Vaccination) కార్యక్రమాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధులు, పలు అనారోగ్య కారణాలతో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine)ను తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. (Who Will Not Receive COVID-19 Vaccin)
గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ, లేదా ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు. 
Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..


గర్భవతులు, పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకాలు తీసుకోకూడదు.


కరోనా లక్షణాలు ఉన్నవారు కనీసం 4 నుంచి 8 వారాల వ్యవధి తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.


కరోనా సోకిన సమయంలో ఎవరైతే చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ తీసుకున్న వారు కనీసం 4 నుంచి 8 వారాల తరువాత కోవిడ్-19 టీకాలు వేయించుకోవాలి


.ప్రస్తుతం ఏదైనా ఇతరత్రా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది వారు డిశ్ఛార్జి అయిన 4 వారాల నుంచి 8 వారాల తరువాత మాత్రమే కరోనా టీకా వేయించుకోవాలని అధికారులు సూచించారు.


ఎవరైనా రక్తము పల్చగా అయ్యేందుకు మెడిసిన్ యాంటీ కో యాగ్యులెట్స్ వాడుతున్నారో.. అలాంటి వ్యక్తులు కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే కరోనా (Coronavirus) టీకా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook