COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం వరకు వరుసగా ఐదు రోజులపాటు 20 వేలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టించినట్టే కనిపించాయి. కానీ ఇంతలోనే శనివారం కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 20 వేల మార్కు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 1 లక్షా 10 వేల 571 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 20,065 మందికి కరోనా సోకినట్టు తేలింది. 24 గంటల్లో 19,272మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా అదే సమయంలో 96 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనాతో పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది చనిపోగా విశాఖ జిల్లాలో 12 మంది, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పది మంది చొప్పున, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, చిత్తూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనాతో కన్నుమూశారు (COVID-19 deaths in AP). 


Also read : Nara Lokesh in criminal case: నారా లోకేష్‌పై క్రిమినల్ కేసు


ఇదిలావుంటే, మరోవైపు కరోనా విషయంలో అసత్య ప్రచారాలకు తెరతీసే వారిని ఉపేక్షించేది లేదని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. ప్రజల మనోధైర్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం (AP govt) హెచ్చరించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe