Dana Cyclone: దాన తుపాను నేపథ్యంలో ఏపీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ కు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. దానా తుపాను తీరం దాటనున్న సమయంలో  గంటకు గరిష్ఠంగా 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి తెలిపారు. దానా తుపాను ప్రభావంతో శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందన్నారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం,వాడరేవు, నిజాంపట్నం  పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి తెలిపారు. సముద్రంలో అలజడిగా  నేపథ్యంలో.. శనివారం వరకు జాలర్లు చేపల  వేటకు వెళ్లొందని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గురువారం రాత్రి వరకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో, ఈ రోజు  రాత్రి నుంచి 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


దానా తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్రన్‌ రైల్వే సీల్దా డివిజన్‌లో ఇవాళ రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య 190 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 200 రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా దారిమళ్లించినట్లు సమాచారం.


మరోవైపు, ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter