Eluru Mystery Disease: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాగునీటి విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక వచ్చింది. ఏలూరు వింతవ్యాధికి కారణం నగరంలోని తాగునీరేనని ప్రాధమికంగా తేలిన నేపధ్యంలో నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏలూరు వింతవ్యాధి ( Eluru mystery Disease ) ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించింది. బాధితుల శరీరంలో సీసం, నికెల్ వంటి భారలోహాలున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక ( Delhi AIIMS Report ) ప్రాధమికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. అసలు బాధితుల శరీరంలో భార లోహాలు ఎలా వెళ్లాయనే విషయంపై దర్యాప్తు కొనసాగించారు. ప్రాధామికంగా ఏలూరులోని మున్సిపల్ వాటర్ ద్వారా ఈ పరిస్థితి ఎదురైందని తెలియగానే ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. 


ఈ నేపధ్యంలో ఏలూరు నగరం నుంచి 16 ప్రాంతాల్నించి వాటర్ శాంపిల్స్ ( Water Samples )ను సేకరించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపారు. ఆ నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. సేకరించిన 16 శాంపిల్స్ లో కేవలం ఒక్క శాంపిల్ లోనే లెడ్ మోతాదు ఎక్కువగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. మిగిలిన 15 శాంపిల్స్ లో ప్రమాదకరమైనవి లేవని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. మొత్తానికి ఏలూరు తాగునీరు సురక్షితంగానే ఉందని నివేదిక ఇచ్చారు. 


గాలి, నీటిలో లెడ్ నికెల్ ఎక్కువ మోతాదులో లేవని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. ఆహార పదార్ధాల్లో మెర్క్యురీ ఉన్నట్టు తేలిందన్నారు. నీటిలో మాత్రం ఎటువంటి బ్యాక్టీరియా లేదని ఎయిమ్స్ నివేదిక చెప్పిందన్నారు. మరోవైపు ఏలూరు అస్వస్థత కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( Ap cm ys jagan ) నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వైద్య బృందాలు, నిపుణులు, అధికార్లతో మాట్లాడారు. ఢిల్లీ ఎయిమ్స్ వంటి కేంద్ర బృందాల నివేదిక అంశాల్ని ముఖ్యమంత్రికి వివరించారు. 


Also read: AP: ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్