AP: ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించనున్నారు.  నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Last Updated : Dec 11, 2020, 05:14 PM IST
AP: ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించనున్నారు.  నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) జీవనరేఖ, ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ( Polavaram project )ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించనున్నారు. ఈ నెల 14వ తేదీన పోలవరం చేరుకుని..ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సవరించిన పోలవరం అంచనాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్ ను ఆమోదించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ ( Gajendra singh shekhawat ) ను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( ap cm ys jagan ) కోరారు. 15 రోజుల్లో ప్రాజెక్టు సందర్శనకు కేంద్రమంత్రి రానున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సరిగ్గా పట్టించుకోలేదని వైసీపీ ఇప్పటికే విమర్శిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే పూర్తయినట్టుగా టీడీపీ ప్రకటించుకుందనేది వైసీపీ నేతల ఆరోపణ. Also read: Dr jayaram murder case: ఎన్ఆర్ఐ జయరాం హత్యకేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం..పోలీసుల చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Trending News