AP Journalists: ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిపై అదే సంస్థ మాజీ అధ్యక్షుడు జాతీయ మీడియా సలహాదారుడైన దేవులపల్లి అమర్ మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన జర్నలిస్టు సంఘమైన ఏపీయూడబ్ల్యూజే(APUWJ)ఆవిర్భావ దినోత్సవాన్ని సావధాన దినోత్సవంగా జరపాలని పిలుపు ఇవ్వడం వివాదాస్పదమైంది. అదే సంఘంలో చీలికకు దారి తీస్తోంది. ఏపీయూడబ్ల్యూజే నిర్ణయాన్ని అదే సంఘానికి అనుంబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా సంఘం తప్పుుబట్టింది. అందుకు భిన్నంగా సగర్వ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు ఐజేయూ(IJU) అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడైన దేవులపల్లి అమర్ మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని సావధాన దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడాన్ని ప్రశ్నించారు. 


కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు శాశ్వత మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవులపల్లి అమర్(Devulapalli Amar) తెలిపారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకకు 5 లక్షల రూపాయలు ఆర్దిక సహాయం అందించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా..ఆ సహాయం పూర్తి స్థాయిలో భరోసో ఇవ్వదని భావించి శాశ్వత మేలు కోసం ఆలోచిస్తోందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో జర్నలిస్టులపై దాడులు ఎక్కడ జరిగాయో ఆధారాలతో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయడం తగదన్నారు. దేవులపల్లి చేసిన ప్రకటనను ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా అసోసియేషన్ (Ap Electronics media Association) స్వాగతించింది. 


Also read: New Highways: ఏపీలో మూడు ప్రధాన పోర్టుల్ని అనుసంధానిస్తూ 13 కొత్త రహదారుల నిర్మాణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook