New Highways: ఏపీలో మూడు ప్రధాన పోర్టుల్ని అనుసంధానిస్తూ 13 కొత్త రహదారుల నిర్మాణం

New Highways: ఏపీలో పోర్టుల అభివృద్ధికి మరో మందడుగు పడింది. పోర్టుల్ని అనుసంధానిస్తూ కొత్తగా రహదారుల్ని నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2021, 02:15 PM IST
New Highways: ఏపీలో మూడు ప్రధాన పోర్టుల్ని అనుసంధానిస్తూ 13 కొత్త రహదారుల నిర్మాణం

New Highways: ఏపీలో పోర్టుల అభివృద్ధికి మరో మందడుగు పడింది. పోర్టుల్ని అనుసంధానిస్తూ కొత్తగా రహదారుల్ని నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) మూడు ప్రధాన పోర్టులున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్ని అనుసంధానిస్తూ లాజిస్టిక్ , కార్గో రవాణా రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ మూడు పోర్టుల్ని అనుసంధానిస్తూ కొత్తగా 13 రహదారులను నిర్మించాలనేది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు కేంద్ర రవాణా శాఖ, జాతీయ రహదారుల శాఖ(NHAI) ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలో మొత్తం 277 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. నాలుగు లైన్లు, ఆరు లైన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో నిర్మించదలిచిన రోడ్లకు 7 వేల 876 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇప్పటికే 6 రోడ్లకు సంబంధించి డీపీఆర్ పూర్తి కాగా..మరో 7 రోడ్లకు డీపీఆర్ రూపొందిస్తున్నారు. ఏడాదిన్నరలోగా రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. భూ సేకరణ వంటి విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోనుంది. ఆగ్నేయాసియా దేశాల్నించి ఎగుమతి, దిగుమతులకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్ని గేట్‌వేలుగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి ఎగుమతి, దిగుమతులకు ఈ మూడు పోర్టులే కీలకం కానున్నాయి. 

కొత్తగా నిర్మించనున్న 13 రహదారుల్లో(13 New Highways in ap) ఆరు రహదారులు విశాఖ పోర్టును మూడు మార్గాల్లో ఎన్‌హెచ్ 16(NH16)తో అనుసంధానిస్తారు. విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్డు మీదుగా భోగాపురం వరకూ 4 లైన్ల రహదారి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టుతో అనుసంధానం సాధ్యం కానుంది. మరో నాలుగు రహదారులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును ఎన్‌హెచ్ 16 తో అనుసంధానించనున్నారు. ఇటు కాకినాడ పోర్టును కూడా ఎన్‌హెచ్ 16తో అనుసంధానించనున్నారు. కాకినాడ పోర్టు నుంచి రాజానగరం ఎన్‌హెచ్ 16 కు అనుసంధానం జరగనుంది. 

Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News