COVID-19 AP: ఏపీలో 4 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో గత 24 గంటల్లో 59,834 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,368 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,45,139 కి చేరింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో మొత్తం 84 మంది చనిపోయారు.
అమరావతి : ఏపీలో గత 24 గంటల్లో 59,834 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,368 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్ ( Corona virus ) పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,45,139 కి చేరింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో మొత్తం 84 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4,053 కి చేరింది. Also read : CSK in IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ ఊరట
గత 24 గంటల్లో 9,350 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,39,876 మందికి చేరింది. Also read : AP: మండలి చైర్మన్.. మరో మంత్రికి కరోనా
ఇప్పటివరకు రాష్ట్రంలో 37,82,746 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 60,611 కరోనా కేసులు నమోదు కాగా 401 మంది కరోనాతో చనిపోయారు. ఇక కరోనా మరణాల సంఖ్య విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో నేటివరకు 429 మంది చనిపోయారు. ఏపీ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం చిత్తూరు జిల్లాలోనే కరోనా మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. Also read : Oxford-Astrazeneca vaccine: చివరి దశలో ప్రయోగాలు..నవంబర్ నాటికి సిద్ధం